జిల్లా స్థాయి ఇసుక కమిటీల మీటింగ్ నివేదికలు త్వరిత గతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

 


వార్త ప్రచురణ :
తేది 29.009.2021.
ములుగు జిల్లా.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుదవారం రోజున జిల్లా స్థాయి ఇసుక కమిటి మీటింగ్ జరిగింది .ఈ మీటింగ్ లో రెవెన్యు మరియు ఫారెస్ ఆక్ట్ భూముల పైన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబందిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ రేంజ్,  రెవెన్యు పరిదిలో ఉన్న భూములకు సంబంధించి నివేదికలను ఫారెస్ట్ అధికారుల నుండి ప్రభుత్వ నిబందనల మేరకు గెజిట్ ననుసరించి నివేదికలు సమర్పించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ  గూగుల్ మ్యాప్ ద్వారా రిపోర్ట్ వచ్చేలా చూడాలని ఇరిగేషన్ ఇఇ జగదీష్ గారిని ఆదేశించారు.

జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం లో నూతనంగా మూడు ఇసుక క్వారీలను గుర్తించడం జరిగిందని,అవి టేకులగూడెం, చెరుకూరు, పెద్ద గొల్లగూడెం ప్రాంతాలను నూతన ఇసుక క్వారీ గా గుర్తించడం జరిగిందాని జిల్లా కలెక్టర్  అన్నారు.  ఏటూరు నాగారం పరిది లో మూడు పట్టా భూముల ఇసుక క్వారీలను గుర్తించడం జరిగిందని వారు అన్నారు. ఇసుక క్వరిలపైన 262 దరఖాస్తులు రాగా 139 పరిష్కరించబడి, మిగతావి పెండింగ్లో ఉన్నాయని వారు అన్నారు. మంగపేట మండలo శివగంగ ఎత్తి పోతల పథకం 2012 లో ప్రారంభించ బడి ఇంకాను ఉపయోగంలో లేదని, దాని విషయంలో ఇరిగేషన్ అధికారులు,గ్రౌండ్   వాటర్ అధికారులు, మైనింగ్ అధికారులు జాయింట్ కమిటీ సర్వే చేసి రిపోర్ట్స్ 15 రోజుల్లోసమర్పించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

జిల్లా స్థాయి ఇసుక కమిటీల లో ఒక గ్రామం – ఒక సొసైటీ అనే నినాదాన్ని ఎంచుకున్నప్పటికి  కొన్ని గ్రామాలలో ఒకటి కంటే ఎక్కువ సొసైటీలు ఉన్నాయని, అయినప్పటికీ ఇసుక క్వారీ ల ద్వారా వచ్చే ప్రతిఫలాలు గిరిజన కుటుంబాలు అందరికీ సమానంగా అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మైనింగ్ ఎడి రఘు,జిల్లా కో ఆపరేటివ్ అధికారి సర్దార్ సింగ్ ,పి.ఓ టిస్ఎండిసి అధికారి రవి, E.E ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, మరియు పిసా జిల్లా కోర్డినేటర్ ప్రభాకర్, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post