జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘ అవార్డు – 2021

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ
నెహ్రూ యువ కేంద్ర ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ యువజన సంఘ అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

ఈ అవార్డు కోసం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న యువజన సంఘాలు 01/04/ 2020- 31/03/2021 మధ్య కాలంలో తాము నిర్వహించిన వివిధ సామాజిక,సేవా,క్రీడా,తదితర కార్యక్రమాల ఫోటోలు,వివరాలు,తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

ఈ దరఖాస్తు లు మాకు చేరవలసిన చివరి తేదీ 30 నవంబర్ -2021.

ఈ అవార్డుకు కేవలం రిజిస్ట్రేషన్ కలిగివున్న యువజన సంఘాలు మాత్రమే అర్హులు

శైలి బెల్లాల్
జిల్లా యువజన సమన్వయ కర్త
నెహ్రూ యువ కేంద్ర
నిజామాబాద్, కామారెడ్డి

Share This Post