*జిల్లా స్థాయి ఎగుమతుల పెంచుటకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య *

వార్త ప్రచురణ
ములుగు జిల్లా:
తేదీ 25.09.2021.

జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ములుగు, భూపాల పల్లి జిల్లా అధికారులతో జిల్లా స్థాయి ఎగుమతుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యపాల్గొని వ్యవసాయ ఆదారిత మరియు భూగర్భ ఖనిజ సంపదను ఎగుమతి చేయుటకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలనీ జిల్లా కలెక్టర్ అన్నారు.ఈ యొక్క ఎగుమతులు కేంద్ర రాష్ట్రాలకే పరిమితం కాకుండా జిల్లా స్థాయికి తీసుకు వెళ్ళుటకు సంబందిత అధికారులు దిశ నిర్దేశం చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా లో గోదావారి పరివాహక ప్రాంతం ఎక్కువ గా ఉన్నందున ప్రాంతాలను బట్టి పండించే పంటల నాణ్యతను అదిక దిగుబడి వచ్చే పంటలను భసార పరిరక్షణను బట్టి రైతులకు అవగాహన కలిపించాలని రెండు జిల్లాల వ్యవసాయ,ఉద్యాన వన శాఖ మరియు సంబదిత శాఖల అధికారులను ఆదేశించారు
జిల్లాలో మిర్చి తదితర పంటల ఆదరంగా కొనుగోలు దారుని అభీష్టం మేరకు పంటలను నాణ్యమైన విత్తనాలతో పండించిన పంటలను జిల్లాలోని రైతులనే ఎగుమతి దారులుగా అవగాహనా కల్పించి నట్లు అయితే జిల్లా లో పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం నాణ్యమైన ఉత్పతులు , సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా రైతులను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 25 సొసైటీలు ఉన్నాయని , ఈ సోసైటిలలో 3700 మంది సభ్యులు గా ఉన్నారని,433ట్యాంక్ లలో 1 కోటి 28 లక్షల చేప పిల్లలను 100% సబ్సిడీ పైన ఉచితంగా పంపిణి చేస్తున్నామని , నాణ్యమైన పోషక విలువలు కలిగిన చేపలను పెంచుటకు జిల్లాలో దాదాపు నాలుగు వేల కుటుంబాలకు జీవనోపాది కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు. సొసైటీ లే కాకుండా 50 మంది మత్స్యకారులు రొయ్యలు మరియు చేప పిల్లలను పెంచుతున్నారని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఫిష్ ప్రాసెస్ ప్లాంట్ పునరుద్ధరించు టకు పచ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శనకు తీసుకు వెళ్లాల్సిందిగా ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ ని ఆదేశించారు. జిల్లా లో అధికార్లు పర్యటించినప్పుడు రైతుల పూర్తి సమాచారం తీసుకోని రైతులకు అవగాహనా కల్పించినట్లు ఐతే నాణ్యత కలిగిన పంటలు పండించే అవకాశము ఉంటుందని కలెక్టర్ అన్నారు.
జిల్లా లో నీటి ప్రరివాహక  ప్రదేశం ఎక్కువగా ఉన్నందున, చేపల పెంపకానికి ముందస్తు ప్రణాళికలు తయారు చేయవలసినదిగా సంబంధిత అధికారిని ఆదేశించారు. ములుగు జిల్లా వాజేడు వాస్తవ్యులు కాకర్లపూడి విగ్నేశ్వర వీర వెంకట సత్యనారాయణ గారు చేప మరియు రొయ్యల సాగు లో రాష్ట్ర స్థాయి లో అవార్డు పొందినందుకు రైతును జిల్లా కలెక్టర్ అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో అమలు చేస్తున్న పథకలను సమర్థవంతంగా వినియోగించు కొనుటకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య కారులకు అవగాహన కల్పించాలని మత్య శాఖ ఫీల్డ్ అధికారి రమేష్ ని ఆదేశించారు.గిరిజన సొసైటీలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
భూపాల పల్లి జిల్లాలోని కాటారం మండలం దామెర కుంట నివాసి శ్రీ కాంత్ తను వంట సామాగ్రికి ఉపయోగించే నిత్యావసర సరకులను వివిధ జిల్లాల నుండి తెచిపించి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరకులను సరస మైన ధరలకు ప్రజలకు సరసమైన ధరలకు విక్రఇస్తూన్నారని , జిల్లా లో నిరుద్యోగ యువకులు, వారి వారి ఆహార్హతల మేరకు ఉత్స హ వంతులకు ప్రభుత్వ ప్రవేశ పెడుతున్న వివిధ పథకాల పైన సబ్సిడీ రుణాలు మంజూరు చేసేల చొరవ తీసుకోవాలని సంబందిత అధికారులకు మరియు బ్యాంక్ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్, ములుగు , భూపాల పలి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు గౌస్ హైదర్ ,విజయ్ భాస్కర్, ఎడి మైస్ రఘు బాబు, కార్పొరేషన్ ఈడీ రవి,యం వెంకటేశ్వర్లు, ఎం ఎ అర్భర్ తదితులు పాల్గొన్నారు.

Share This Post