జిల్లా స్థాయి టెలికాం కమిటీ మొదటి సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

జిల్లా స్థాయి టెలికాం కమిటీ మొదటి సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

గురువారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో ఎయిర్ టెల్ , రిలయన్స్ జియో, టి ఫైబర్ కార్పొరేషన్ ఏజెన్సీ లతో, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నెట్ వర్క్ ఎంతో అవసరమని, సెల్ టవర్స్ ఏర్పాటు వలన ప్రజలకు ఎటువంటి హాని జరగదని, మొబైల్ టవర్ల నుండి భద్రత, టవర్స్ హానికారకం కాదు అని చెప్పే విషయంలో ప్రజలకు విశ్వాసం , నమ్మకాన్ని కలిగించాలని, అపోహలు తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. టవర్స్ ఏర్పాటు చేసే సమయంలో రోడ్లు మరియు భవనాల, పంచాయతీ రాజ్ రోడ్లకు నష్టం జరగకుండా చూడాలని, గ్రామ పంచాయతీలలో, మునిసిపాలిటీలలో టవర్స్ ఏర్పాటు నిబంధనల మేరకు చేయాలనీ సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించారు . టవర్స్ ఏర్పాటు సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి నెల 5వ తేదీలోపు నోడల్ అధికారి రాజేశ్వర్ రెడ్డికి నివేదికలు పంపాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి , జిల్లా పరిషత్ సి ఈ ఓ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పి డి డి ఆర్ డి ఏ ప్రభాకర్, ఇరిగేషన్ డి ఈ సుజాత, ఆదిభట్ల మునిసిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డి, మణికొండ మునిసిపల్ కమీషనర్ ఫాల్గుణ కుమార్, ఈ ఈ పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బీ డి ఈ, అటవీ , పోలీస్, ట్రాన్స్కో అధికారులు, ఎయిర్ టెల్ నుండి శివ శంకర్ రెడ్డి, రిలయన్స్ జియో నుండి రూపేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post