జిల్లా స్థాయి లేఅవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:21.12.2021,  వనపర్తి.

లే అవుట్లను క్రమబద్ధీకరించుటకు అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వనపర్తి, పెబ్బెర్, ఆత్మకూర్ మున్సిపాలిటీలలోని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డిస్టిక్ లెవెల్ లేఅవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో లేఅవుట్లు క్రమబద్ధీకరించడానికి కమిటీ పర్యవేక్షణ చేసి, మూడు మున్సిపాలిటీలలో లే అవుట్లను క్రమబద్దీకరించినట్లు, ఒకటి పెండింగ్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ పనులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని అధికారులకు ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవిన్యూ) డి.వేణు గోపాల్, డి.పి. ఓ, పి.ఆర్. ఈ. ఈ, ఆర్ అండ్ బి ఈ. ఈ, ఇరిగేషన్ ఈ. ఈ,  వనపర్తి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పెబ్బేర్, ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్లు జాన్ కృపాకర్, రమేష్, టి పి ఎస్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post