*జిల్లెల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

*జిల్లెల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

*ప్రచురణార్థం-1*

రాజన్న సిరిసిల్ల, డిసెంబరు 5: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం సాయంత్రం తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులతో ఇప్పటివరకు ఎంత మంది రైతుల వద్ద నుండి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం సేకరించారనే వివరాలను ఆయన స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకం, తేమ పరీక్ష యంత్రాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఏక్యూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. రైతుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ట్రక్ షీట్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు. ధాన్యం అమ్మిన రైతుకు సంబంధించి డబ్బులు త్వరితగతిన రైతు ఖాతాలో జసమకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు సమీపంలో గల శ్రీ మహేశ్వరి పారా బాయిల్డ్ రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. వాహనాల ద్వారా ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ప్రక్రియను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హమాలీల సంఖ్యను పెంచుకొని ఖరీఫ్ ధాన్యం బస్తాల అన్ లోడింగ్ లో వేగం పెంచాలని సూచించారు. రబీకు సంబంధించి పెండింగ్ సిఎంఆర్ రైస్ త్వరగా పూర్తిచేసి భారత ఆహార సంస్థకు అప్పగించాలని రైస్ మిల్లర్ ను ఆదేశించారు. రైస్ మిల్లుకు ప్రత్యేకంగా కేటాయించిన స్థానిక నోడల్ అధికారి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ తనిఖీల సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, తహశీల్దార్లు విజయ్ కుమార్, సదానందం, తదితరులు ఉన్నారు.

Share This Post