జి. ఓ. 58 దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

జి. ఓ. 58 దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

జి. ఓ. 58 దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -31:

ప్రభుత్వ ఉత్తర్వులు 58 ప్రకారం వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చేస్తున్న క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక జి. ఓ.58 దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్న అధికారులతో పరిశీలన ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, సంభందిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, ధృవీకరణ పత్రాలు పరిశీలన సమయంలో ఇంటి ముందు ఉండి యాప్ లో నమోదు చేస్తూ, ప్రొఫార్మ లో వివరాలు వ్రాయాలని, 2014 కంటే ముందు ఇల్లు కట్టుకొని ఉన్న ప్రభుత్వ భూములలో అభ్యంతరం లేని వాటినీ మాత్రమే క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్, మరిపెడ, కురవి మండలం లో దరఖాస్తుల పరిశీలన పై సంభందిత అధికారులతో సమీక్షించారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో, తహశీల్దార్లు, పరిశీలన బృందం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post