జి. ఓ. 58 ప్రకారం వచ్చిన దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి….జిల్లా కలెక్టర్ కె. శశాంక

జి. ఓ. 58 ప్రకారం వచ్చిన దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి….జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

జి. ఓ. 58 ప్రకారం వచ్చిన దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి….జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -23:

జి. ఓ. 58 ప్రకారం వచ్చిన దరఖాస్తులను ప్రతి రోజు 25 చొప్పున పరిశీలన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జి. ఓ 58 ప్రకారం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో చేయవలసిన పరిశీలన పై జిల్లా అధికారులు, తహసిల్దార్ లతో, క్షేత్ర పరిశీలన టీమ్ సభ్యులతో, సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులు 58 ప్రకారం వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కొరకు జిల్లా స్థాయి అధికారి, డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్ తో కూడిన 12 టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చిన మొత్తం దరఖాస్తుల నుండి టీమ్ కు 250 దరఖాస్తులను కేటాయించినట్లు, రోజుకు 25 దరఖాస్తులు చొప్పున ఒక టీమ్ పరిశీలన పూర్తి చేయాలనీ, ఒకే ప్రాంతం లో ఉన్న వాటిని ముందుగా గుర్తించి ఒకేసారి పరిశీలించాలని, అవి పూర్తైన తర్వాత మల్లోక ప్రాంతానికి వెళ్లి మరీ కొన్ని దరఖాస్తులను జాబితా ప్రకారం పరిశీలించాలని తెలిపారు.

పరిశీలన సందర్భంగా అన్ని అంశాలను ధ్రువీకరించుకోవాలని, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ టాక్స్, ఆదాయ ధ్రువీకరణ ను పరిశీలించాలని, పరిశీలన సందర్భంగా సంబందిత ప్రాంతంలో ఉండి పరిశీలన, కొలతలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ముందుగా ఆ భూమి అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి అయి ఉండాలని, 2014 జూన్ 2 కంటే ముందు 125 గజాల లోపు ఇల్లు నిర్మించుకొని ఉన్నట్లు ధృవీకరించుకోవలని, మునిసిపల్ కమిషనర్ ల నుండి సర్టిఫైడ్ కాపీ జాబితాను తీసుకొని క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంగా ఆ జాబితాతో ధృవీకరంచుకోవాలని తెలిపారు. పది రోజుల్లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసుకొని వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేయాలనీ తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వులు 58 లోని నిబంధనల ప్రకారం
క్షేత్ర పరిశీలన చేసి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వివరాలు తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, మండల ప్రత్యేక అధికారులు డాక్టర్ టి.సుధాకర్, రామకృష్ణ, సూర్యనారాయణ, మహబూబాబాద్, తొర్రూర్ తహసిల్దార్ లు నాగభవానీ, రాఘవ రెడ్డి, మరిపెడ తహశీల్దార్ రాం ప్రసాద్, టీమ్ మెంబర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post