ప్రచురణార్థం….2
తేదీ.14.3.2023
జీఓ 59 కింద అర్హులైన లబ్దిదారులకు పట్టాల పంపిణీ:: సి.జెడ్పి. శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
6 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ పూర్తి
125 గజాల లోపు ఉన్న లబ్దిదారులకు జీఓ 58 కింద ఉచితంగా పట్టాల పంపిణీ
జీఓ 59 కింద నిర్దేశించిన రుసుము 100% చెల్లించిన వారికి పట్టాల పంపిణీ
జిల్లాలో జీఓ 59 కింద 56 మంది ఆర్హుల ఎంపిక
జయశంకర్ భూపాలపల్లి మార్చి 14:-
జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద చెల్లింపులు పూర్తి చేసిన 8 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ , స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లతో కలిసి జెడ్పీ సమావేశ మందిరంలో జీఓ 59 కింద చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న 6 మంది లబ్ధిదారులకు పట్టాలను కలెక్టర్ పంపిణీ చేశారు.
ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ పరిధిలోని భూములు ఇండ్లు నిర్మించుకున్న సామాన్యులకు క్రమబద్దికరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 58,59 మంజూరు చేసిందని , దీని కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి గత సంవత్సరం అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం 125 గజాల లోపు భూమిలో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పూర్తి ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58 ప్రకారం క్రమబద్దీకరణ చేస్తుందని, 125 నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 50% , 250 నుంచి 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 75%% , 500 గజాల కంటే అధిక స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారు 100% రిజిస్ట్రేషన్ విలువ రుసుముగా చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర సంఖ్య 59 జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58 ప్రకారం 125 గజాల లోపు స్థలంలో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారించిన తర్వాత అర్హులుగా గుర్తించి వారికి పట్టాలను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వ సంఖ్య 59 ప్రకారం ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారించిన తర్వాత 56 మందిని అర్హులుగా గుర్తించి చెల్లించాల్సిన రుసుము వివరాలు తెలియజేశామని, ఇప్పటివరకు అందులో 8 మంది లబ్ధిదారులు 100% రుసుము చెల్లించారని వారిలో 6 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నామని, మరో 2 లబ్ధిదారులకు రేపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పట్టాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 ప్రకారం అర్హులుగా ఎంపికైన మిగిలిన లబ్ధిదారులు నిబంధనల మేరకు నిర్దేశించిన రుసుము చెల్లించిన తర్వాత క్రమబద్ధీకరణ పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మించుకున్న వారిని ప్రభుత్వం ఇంటి పట్టాలు పంపిణీ చేస్తుందని, 125 గజాల లోపు స్థలంలో నిర్మించుకున్న పేదలకు పూర్తి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తుందని తెలిపారు.
పేదల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ ఇటీవలే నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జీఓ 58,59 కింద కటాఫ్ తేది పెంచుతూ మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారని దీని ప్రకారం త్వరలో తేదీలు నిర్ణయించే ప్రభుత్వం మరోసారి దరఖాస్తులు స్వీకరించి మిగిలిన అర్హులకు సైతం పట్టాలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, సి.ఈ. ఓ. జెడ్పి రఘువరన్, జెడ్పీటీసీ లు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది