ప్రచురణార్థం—-3
తేదీ.7.6.2022
జీవితాన్ని ఎంచుకో పోగాకుని కాదు:: జిల్లా కలెక్టర్ జి.రవి
పొగాకు వాడకం నియంత్రణకు పటిష్టమైన చేయాలి
పొగాకు వల్ల కలిగే నష్టాల పై విస్తృత ప్రచారం
పొగాకు నియంత్రణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి
విద్యా సంస్థల 100 గజాల పరిసరాల్లో పొగాకు విక్రయం నిషేధం
పొగాకు నియంత్రణ పై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై జిల్లాస్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జూన్ 7:- జీవితాన్ని ఎంచుకో పోగాకుని కాదని జిల్లా కలెక్టర్ జి.రవి పిలుపునిచ్చారు. పొగాకు నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
దేశ పౌరులందరి ఆరోగ్యం, శ్రేయస్సుకు పొగాకు అత్యంత ప్రమాదకరమైందని, వ్యక్తి ఆరోగ్యాన్నే కాక అభివృద్ధి ని కూడా ఆటంకపరుస్తుందని కలెక్టర్ అన్నారు.పొగాకు దానిని ఉపయోగించే వ్యక్తి పై మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ పొగ ద్వారా చుట్టుపక్కల ప్రజలను కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
పొగాకు వినియోగం వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో 10 లక్షల మంది మరణిస్తున్నారని, 90% క్యాన్సర్ మరణాలు పొగాకు వల్ల సంభవిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. భారతదేశంలోనే అత్యధికంగా నోటి క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని, పొగ త్రాగేవారితో పాటు ఆ పోగను పీల్చే వారు సైతం ప్రమాదంలో ఉంటారని తెలిపారు.
భారత దేశంలో యువకుల్లో 2౦౦౩ లో 16.9%, 2009లో 14.9 శాతం మంది పొగాకు వాడేవారిని, 2019 నాటికి అది 8.5 శాతానికి తగ్గిందని GYTS(Global youth tobacco survey) సర్వే తెలుపుతుంది. ఇది మంచి శుభ పరిణామమని, యువతలో పొగాకు వాడటం వాళ్ళ కలిగే దుస్పరినామాల గురించి విస్త్రుత ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు.
పొగాకు వాడకం ద్వారా నోటి క్యాన్సర్, కాలేయం క్యాన్సర్, ఉపిరితిత్తుల క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు , గర్బాశయ క్యాన్సర్, మగవారిలో జడతత్వం, ఆడవారిలో పిల్లలు పుట్టుక సామర్థ్యం తక్కువ వంటి వ్యాధులు వస్తాయని కలెక్టర్ తెలిపారు.
ప్రతి సీగరెట్టు కాల్చడం వల్ల 13 నిమిషాల ఆయుషు కోల్పోతామని అధికారులు తెలిపారు. కోప్టా చట్టం సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పోగత్రాగడం నిషేదమని, సెక్షన్ 6 ప్రకారం 18 సంవత్సరాల్లోపు పిల్లలకు, స్కూల్ 100 గజాల పరిసర ప్రాంతాల్లో పోగాకు విక్రయం నిషేధమని అన్నారు. కోప్టా చట్టం అమలు కోసం బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రతిమాసం కోప్టా నేరాల వివరాలు సేకరించాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఉన్న విద్యా సంస్థల 100 గజాల పరిసరాలలో పోగాకు విక్రయం నిషేదించాలని,
విద్యా సంస్థల్లో పొగాకు దుష్ప్రభావాలు గురించి వ్యాసరచన, వ్రకృత్వా పోటీలు, ప్రముఖులతో ప్రసంగాలు, చిన్న షార్ట్ ఫిల్మ్స్ మొదలగు వాటిద్వారా అవగాహసన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి కోప్టా చట్టాన్ని అన్ని శాఖల అధికారులు కలిసి అమలు చేయాలని, దీని ద్వారా పొగాకు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు.
కోప్టా చట్ట నిబందనలను అతిక్రమించిన వారి పై చట్టరీత్య చర్య తీసుకోవాలని, దీని కోసం పొలీసు, విద్యా శాఖ, ఆరోగ్య శాఖ, లేబర్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి, సానిటరీ ఇన్స్పెక్టర్, వాణిజ్య పన్నుల అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, వ్యవసాయధికారి, మొదలగు వివిధ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పుప్పాల శ్రీధర్ , జిల్లా అసంకమిక వ్యాదుల నియంత్రనాధికారి డా. సమియుద్దిన్ , డిప్యూటి డి.ఎం.హెచ్. ఓ . డా. నిలారపు శ్రీనివాస్ , రాష్ట్ర కో- ఆర్డినటర్ శ్రావణ్ కుమార్ , ప్రోగ్రాం అధికారి జైపాల్ రెడ్డి, కమిటీ మెంబర్స్ సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
