జుక్కల్ క్లస్టర్ లో రుర్బన్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీరాజ్, ఇరిగేషన్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు

Press Release. Dt.19.8.2021

జుక్కల్ క్లస్టర్ లో రుర్బన్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీరాజ్, ఇరిగేషన్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.
గురువారంనాడు ఆయన తన చాంబర్లో రూర్బన్ పనులను సమీక్షిస్తూ, గ్రామ పంచాయతీ, లైబ్రరీ, సిటిజన్ సర్వీస్ బిల్డింగ్ సంబంధించి 9 పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అక్టోబర్ 10 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

TSMIDS ద్వారా చేపట్టిన జుక్కల్ మండల కేంద్రంలోని మినీ స్టేడియం అక్టోబరు 31 లోగా, హాస్పిటల్ కాంపౌండ్ వాల్ సెప్టెంబర్ 15 లోగా పూర్తి కావాలని ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ చేపట్టిన 7 చెక్ డ్యాముల పనులలో 6 పనులు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన నాగల్ గామ్ గ్రామంలోని ఒక చెక్ డ్యామ్ పనులు అక్టోబర్ చివరి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జుక్కల్ మండల కేంద్రంలోని గ్రీనరీ పార్క్ పనులలో ఉద్యానవన శాఖ అధికారుల అలసత్వం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం చెందారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ పనిని చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. శాశ్వత తీగజాతి పందిరి సాగు పనులను ఈ నెల చివరిలోగా పూర్తిచేయాలని ఉద్యానవన అధికారిని ఆదేశించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా లబ్ధిదారులకు అందించే ఆయిల్ మిల్, దాల్ మిల్, పోహా మిల్ ఒక వారంలో గ్రౌండింగ్ చేపట్టాలని ఆదేశించారు.

సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, ఏ పి డి సాయన్న‌, పంచాయతీ రాజ్ DE విజయ్ కుమార్, TSMIDC, నిజామాబాద్ DE పి. సుధాకర్, నీటిపారుదల శాఖ DE దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.

…..DPRO. KMR.

Share This Post