జూన్ 1 నుంచి అన్ని పి హెచ్ సి లలో ఆరోగ్య సేవలు వెంకటేశ్వరరావు

జిల్లాలో జూన్ 2 నుండి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ సేవలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అని పి .హెచ్.సి. లలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఆయుశ్మాన్ భారత్- ఆరోగ్యశ్రీ పధకం క్రింద 53 రకాల జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇప్పటికే అన్ని ఆరోగ్య కేంద్రాలకు ట్రస్ట్ నుండి పాస్ వర్డ్, లాగిన్ ఐ.డి.లను పంపామని గుర్తు చేసారు.
ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ విజయభాస్కర్, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య మిత్ర అంతోళ్ళ సురేష్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

Share This Post