జూన్ 10న జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్

జూన్ 10న జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్

 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి కె. వెంకటేశ్

 

0 0 0 0

 

 

            జిల్లాలోని అన్ని కోర్టులలో జూన్ 10న జాతీయ లోక్ అదాలత్ లను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి కె. వెంకటేశ్ తెలిపారు.

 

 

            శుక్రవారం సాయత్రం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  జాతీయ న్యాయసేవాధికార సంస్థ డిల్లీ మరియు తెలంగాణ  రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైదరాబాద్ గారి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులలో 10-06-2023న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.   ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మోటార్ వాహనాల చట్టానికి సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని, కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.  మే 31 నాటికి 1491 లిటిగేషన్ కేసులు, 704 ప్రి లిటిగేషన్ కేసులను గుర్తించడం జరిగిందని, అందులో 965 లిటిగేషన్ కేసులకు మరియు 210 ప్రీ లిటిగేషన్ కేసులకు నోటీసులను జారిచేయడం జరిగిందని తెలిపారు.

Share This Post