జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు గ్రామ, మండల, డివిజన్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు నిండి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు ఘనంగా అంగ రంగ వైభవంగా జరపాలని చెప్పారు. ఐడిఓసి కార్యాలయం వెలుపల ఉన్న కార్యాలయాల అధికారులు 2వ తేదీ ఉదయం 8.30 గంటలకు వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రగతి మైదానంలో అమర వీరులకు నివాళులర్పించు కార్యక్రమంలో పాల్గోని అక్కడి నుండి ఐడిఓసి కార్యాలయానికి చేరుకోవాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లును విద్యుద్దీకరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.

Share This Post