జూన్ 2 కి సర్వం సిద్ధం :జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్

తేదీ.1.6.2023.

సూర్యాపేట.

 

జూన్2 కు సర్వం సిద్ధం.

 

ఆదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్.

 

జూన్2 కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు నిర్దేశించిన సమయానికి ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని ఆదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జూన్2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వణలో భాగంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న 20 స్టాల్స్, 20 శకటాలు, స్టేజి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరంతర విద్యుత్, శమియనాలు, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని ముక్యంగా వాటర్ ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలని అమరవీరుల స్తూపం, స్టేజి ని పూల అలంకరణతో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా కార్యక్రమానికి విచ్చేసే సందర్శకులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ పాయింట్స్ పెట్టాలని ఆదేశించారు. అన్ని స్టాల్స్ లో గైడ్స్ ను ఉంచాలని ఎక్కడకూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ కిషోర్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post