జూన్ 2 లోగా బస్తి దవాఖాన ను అందుబాటులో కి తేవాలి : మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

 

*జూన్ 2 లోగా బస్తీ దవఖానాను* *అందుబాటులోకి తేవాలి : మున్సిపల్* *అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం*

—————————–
సిరిసిల్ల లో నిర్మిస్తున్న బస్తీ దవఖానా ను
జూన్ 2 లోగా అందుబాటులోకి తేవాలనీ మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్ లో ఆర్థిక సంఘం నిధులు రూ.13 లక్షలతో నిర్మిస్తున్న ఉన్న బస్తీ దవాఖాన ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో బస్తీ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినందున మిగతా పనులు చుట్టూ కాంపౌండింగ్, సెప్టిక్ ట్యాంక్, బాత్ రూం లపై స్లాబ్, రేయిలింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, Aee వరుణ్ తదితరులు ఉన్నారు.

*పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్*

సోమవారం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభ మైన నేపథ్యంలో
తంగళ్ళ పల్లి మండలం లోని జిల్లెళ్ళ, తంగళ్ళ పల్లి గ్రామంలో రెండు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం తనిఖీ చేశారు.
ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. చూచి రాతలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట Deo ధనాలకోట రాధా కిషన్, స్థానిక తహశీల్దార్
సదానందం లు ఉన్నారు.

జిల్లా విద్యాధికారి సిరిసిల్ల పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్, నెహ్రూనగర్, అంబేద్కర్ నగర్, విజ్ఞాన వర్దినీ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

తొలి రోజు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగాయని Deo ధనాలకోట రాధా కిషన్ తెలిపారు.
——————————

Share This Post