జూన్ 2 వ తేదీ నాటికి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*జూన్ 2 వ తేదీ నాటికి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

……………….

వచ్చే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రతి మండలంలోనీ కనీసం రెండు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభోత్సవం కు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తో కలిసి
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ , ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, మద్దికుంట, గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామం లో
క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ క్రీడా ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో వాలీబాల్ కోర్టు, ఖోఖో, కబడ్డీ, ఫుట్ బాల్, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఈ క్రీడా ప్రాంగణాల్లో లైటింగ్, నీటి సదుపాయం, బెంచీలు, టాయిలెట్లు, తదితర సౌకర్యాలు కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రాంగణం చుట్టూ బయో ఫెన్సింగ్ చేయాలని ఆదేశించారు.

*ఈ నెలాఖరులోగా ఈ- హెల్త్ ప్రొఫైల్ సర్వే పూర్తి కావాలి:*

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఈ- హెల్త్ ప్రొఫైల్ సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మిగిలిన ప్రజలకు సంబంధించి ఇంటింటి సర్వే చేపట్టారు.  ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తయ్యేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్శనలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, dpo రవీందర్, మండల తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.

——————————

 

Share This Post