జూన్ 3వ. తేది నుండి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై వీడియో కాన్ఫెరెన్స్ : పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రిక ప్రకటన     తేది:30.05.2022, వనపర్తి.

జూన్ 3వ. తేది నుండి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుండి పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి పల్లె ప్రగతి కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ, జూన్ 3వ తేదీ నుండి 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించడం, విద్యుత్ సమస్యలు పరిష్కరించటం ఇతర పనులను చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై సూచనలు అందించారు.
జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3వ తేదీ నుండి ప్రారంభంకానున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడతామని ఆయన వివరించారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతతో పాటు అంతర్గత, సీసీ రోడ్లు, రహదారుల వెంట మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు, వైకుంఠ దమాలలో నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, విద్యుత్తు వైర్లు ఏర్పాటు, విద్యుత్ స్తంభాలను సరిచేయడం వంటి విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హరితహారంలో భాగంగా చెరువులు, కాలువలు, కుంటలు, రహదారుల వెంట ఎరవిగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తయారు చెప్తున్నట్లు ఆయన సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post