*జూన్ 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం ను అందివచ్చిన అవకాశంగా అధికారులు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

*జూన్ 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం ను అందివచ్చిన అవకాశంగా అధికారులు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

*జూన్ 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం ను అందివచ్చిన అవకాశంగా అధికారులు తీసుకోవాలి*

– పల్లె ప్రగతి నీ పకడ్బందీ కార్యక్రమంగా చేపట్టాలి

– చేపట్టాల్సిన పనులను ముందే గుర్తించాలి

– శిథిలావస్థ కు చేరి ప్రజా భద్రత కు ప్రమాదకరంగా మారిన కట్టడాలను కూల్చి వేయాలి

– ఈ- హెల్త్ ప్రొఫైల్ స్క్రీనింగ్ వేగంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి

– జూన్ 2 వ తేదీ లోగా ఈ- హెల్త్ ప్రొఫైల్ స్క్రీనింగ్ పూర్తి చేయాలి

– ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————
సిరిసిల్ల 27, మే 2022:
——————————
గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు , పచ్చదనం ను పెంపొందించేందుకు జూన్ 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం ను అందివచ్చిన అవకాశంగా భావించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జూన్ 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం సన్నద్ధత మండల తహశీల్దార్ లు, ఎంపిడివో లు, ఎంపీఓ లు, పంచాయితీ సెక్రటరీ లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

అన్ని గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న మొత్తం కుటుంబాలు, పంచాయతీ సిబ్బంది, గ్రామంలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలు, వీటిలో ప్రతిరోజూ శుభ్రం చేస్తున్న రోడ్లు, డ్రెయిన్లు, చదును చేసిన ప్రదేశాలు, ఇంకా పూడ్చాల్సిన ప్రదేశాలు, కూలిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, వాటిలో పడగొట్టిన, తొలగించిన ఇండ్లు, ఇంకా పడగొట్టాల్సిన, తొలగించాల్సిన ఇండ్లు, పూడ్చిన బావులు, పూడ్చాల్సి ఉన్న బావులు, శుభ్రం చేసిన ఖాళీ స్థలాలు, ఇంకా శుభ్రం చేయాల్సిన ఖాళీ స్థలాలు, పూడ్చిన బోరు బావులు, పూడ్చాల్సి ఉన్న బోరు బావుల వివరాలను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆలాగే గ్రామాల్లోని చెరువు కట్టలను బలోపేతం చేసుకోవాలన్నారు. కీటక కీటక జనిత వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు నీట్ నీరు నిలవ అ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గ్రామాల్లోని బావుల్లో దోమలు వృద్ధి చెందకుండా వేల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలు సబ్ సెంటర్లు ప్రభుత్వ కార్యాలయ భవనాలు అన్నింటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

శిథిలావస్థ కు చేరి ప్రజా భద్రత కు ప్రమాదకరంగా మారిన కట్టడాలను గుర్తించి కూల్చి వేయాలన్నారు.

గ్రామాల్లో ప్రధానంగా వంగిపోయిన, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తుప్పు పట్టిన , దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సెస్ అధికారుల సమన్వయంతో కొత్తవి వేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.

*జూన్ 2 వ తేదీ లోగా ఈ- హెల్త్ ప్రొఫైల్ స్క్రీనింగ్ పూర్తి చేయాలి*

జూన్ 2 వ తేదీ లోగా జిల్లాలో ఈ- హెల్త్ ప్రొఫైల్ స్క్రీనింగ్ పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

మిగిలిన వారు త్వరగా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా ప్రతి గ్రామంలో టాంటాం వేయించాలన్నారు.
ఈ- హెల్త్ ప్రొఫైల్ స్క్రీనింగ్ వేగంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించనుండడంతో సన్నద్దత పై సమీక్షించారు. వర్షాకాల సమీపిస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ వి.లీల, డీఆర్డీఓ మదన్ మోహన్, డీపీఓ రవీందర్, డీసీఓ బుద్ధనాయుడు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీష్, dao రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post