జూన్ 3 నుండి జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్ర రెడ్డి అధికారులకు సూచించారు.

జూన్ 3 నుండి జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్ర రెడ్డి అధికారులకు సూచించారు.

సోమవారం మంత్రి బడిబాట కార్యక్రమంపై వివిధ జిల్లాల డి.ఈ.ఓ.లు, ఏం.ఈ.ఓ.లు, సెక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 3 నుండి 10 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. బడిబాట కోసం మంగళవారం నుండి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో
పంచాయతి రాజ్, మున్సిపల్ , స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలతో కోఆర్డినేషన్ సమావేశాలను నిర్వహించాలని సూచించారు.

తక్కువ ఎన్ రోల్ మెంట్ ఉన్న పాఠశాలలపై, విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

మన ఊరు మన బడి, ఇంగ్లీష్ మీడియం లో బోధన, (ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ) రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేస్తారని, తదితర విషయాలపై గ్రామ గ్రామాన తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 3 నుండి 10 వరకు పాఠశాల స్థాయిలో బడిఈడు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఒక లక్షా 28 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని , ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య ను మరింత పెంచడానికి ప్రణాళిక చేస్తున్నట్లు డి ఈ ఓ రాజేష్ మంత్రికి తెలిపారు. బడి ఈడు గల పిల్లలదరిని బడిలో చేర్చే విధంగా ఆయా అనుబంధ శాఖల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఈఓ రాజేష్ , సెక్టోరల్ అధికారులు , ఎం ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post