జూన్ 3 నుండి బడిబాట కార్యక్రమం : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగవాన్

వనపర్తి, మే 30,2022
పత్రికా ప్రకటన

జూన్ 3 నుండి జరిగే  బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్ర రెడ్డి అధికారులకు సూచించారు.  సోమవారం బడిబాట కార్యక్రమంపై వివిధ జిల్లాల డి.ఈ.ఓ.లు, ఏం.ఈ.ఓ.లు, సెక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 3 నుండి 10 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి  విజయవంతం చేయాలని ఆదేశించారు. బడిబాట కోసం మంగళవారం నుండి సన్నాహక కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు. పంచాయతి రాజ్, మున్సిపల్ , స్త్రీ శిశు సంక్షేమం  తదితర  శాఖలతో సమన్వయ సమావేశాలను జిల్లా కలెక్టర్ల సారధ్యంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలపై, పిల్లలెవరూ లేని పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
వివవిధ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ  బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు.  జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశాలను  నిర్వహించాలని  ఆమె సూచించారు.
జూన్ 13న పాఠశాలల పున :ప్రారంభాన్ని పండుగలా చేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీదేవసేన ఆదేశించారు.  జూన్ 13 నుండి 30వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగవాన్ ,జడ్. పి. సి. ఈ. ఓ. వెంకటరెడ్డి,డీఈఓ రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post