జూన్ 3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు….

జూన్ 3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు….

ప్రచురణార్థం

జూన్ 3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు….

మహబూబాబాద్, మే -30:

జూన్ 3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

సోమవారం హైదరాబాద్ నుండి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి పల్లె ప్రగతి, క్రీడా ప్రాంగణం ఏర్పాటుపై సమీక్షించారు.

ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ ప్రజ్ఞాసమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పాల్గొన్నారు.

వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, జిల్లాలో జూన్ 3 నుండి 18 వరకు పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో త్రాగునీటి, పారిశుధ్యం నిర్వహణతో పాటు, వైకుంఠ ధామాలు, శెగ్రిగేషన్ షేడ్స్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకరావాలని, 4వ విడత పల్లె ప్రగతిలో ప్రగతిని సమీక్షించుకుని 5వ విడత పల్లె ప్రగతికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పల్లెప్రగతీ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు రోజు వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే జిల్లాలో జూన్ 2 నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించుటకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసయ్య, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, డి పి ఓ సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post