జూన్ 4 లోపు జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—2

తేదీ.24.5.2022

జూన్ 4 లోపు జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, మే 24:-
జిల్లాలో 2022-24 సంవత్సరానికి గానూ రెండేండ్ల వ్యవధి గల అక్రిడిటేషన్ కార్డు ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవి ఒక ప్రకటన లో తెలిపారు.

2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 31 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టు ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుట్లు తెలిపారు.

జిల్లాలోని జర్నలిస్టులు మే25 నుంచి సమాచారశాఖ ఆన్లైన్ వెబ్ సైట్ https:/ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన ఫోటోలను, విద్యార్హతలు, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు.

ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 4 వ తేదీ తుది గడువు అని తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

డీ.పీ.ఆర్.ఓ, జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post