జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 పురస్కరించుకొని – జిల్లాస్థాయి వ్యాసరచన, ఉపన్యాస మరియు చిత్రలేఖన (డ్రాయింగ్) పోటీలు
********
తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Mission LIFE ( Life Style for Environment ) – “పర్యావరణం కొరకు జీవిత విధానాలు ” అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్, వనపర్తి గారి ఆదేశానుసారం జిల్లాలోని అన్నీ మండలాల విద్యాశాఖ అధికారులు , అన్నీ ప్రభుత్వ పాఠశాలలు & ప్రవేటు పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ మరియు స్పెషల్ ఆఫీసర్స్ గారికి తెలియజేయునది ఏమనగా,
పర్యావరణ దినోత్సవం – 2023 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 8,9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గురించి అవగాహన చేయుటకుగాను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన జిల్లాలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది.
* పై మూడు అంశాలలో పాల్గొనేటటువంటి విద్యార్థులు మొదటగా ఈ క్రింద ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లో విద్యార్థుల వివరాలను తేదీ 28.05. 2023 లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను .
https://forms.gle/D5yhgfxhnz1CAuAc7
పై మూడు విభాగాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయి పోటీలలో తేదీ 31.05 2023 ( బుధవారము ) ఉదయం 8 గంటలకు బాలుర హైస్కూల్ వనపర్తి లో పాల్గోనుటకు హాజరు కావలెను.
Main Theme ( ముఖ్య అంశం )
1. Essay Writing వ్యాసరచన
LIFE (Life style for Environment ) – పర్యావరణం కొరకు జీవిత విధానాలు
2. Elocution / ఉపన్యాస పోటీ
Solutions to Plastic Pollution/ ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కార మార్గాలు
3. Drawing/ చిత్రలేఖన పోటీ
Plant trees to reduce the impact of pollution.
కాలుష్య ప్రభావాన్ని తగ్గించుటకు చెట్లను పెంచడం
జిల్లాస్థాయిలో విజేతలైన విద్యార్థులకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుండి బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది.
నోట్:
1. గూగుల్ రిజిస్ట్రేషన్: 28.05.2023 లోపు చేసుకొనవెలెను.
2. జిల్లాస్థాయి పోటీలు : తేది 31.05.2023 ( బుధవారము )
3. పోటీలు నిర్వహించు స్థలము: బాలుర హైస్కూల్, వనపర్తి.
ఈ కార్యక్రమ సమన్వయ కర్తలుగా జిల్లా సైన్స్ అధికారి,శ్రీనివాసులు గారు,9394574814 , NGC జిల్లా కోఆర్డినేటర్ ఐ. సుదర్శన్ రావు గార్లు 9491377374 వ్యవహరిస్తారు.
జిల్లా విద్యాధికారి, వనపర్తి.