పత్రిక ప్రకటన
తేది 29-5-2023
నాగర్ కర్నూల్ జిల్లా
జూన్ 6న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్న నాగర్ కర్నూల్ జిల్లా నూతన సమీకృత కార్యాలయాల సముదాయములో తుదిమెరుగులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తో కలిసి నూతన సమీకృత కార్యాలయ సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్, స్టేట్ ఛాంబర్ లో ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేసి తుది మెరుగులు దిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్.టి లైన్ కనెక్షన్ వెంటనే ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. ప్రారంభోత్సవ వేడుకలకు పూలు, మొక్కలతో అలంకరణ బాధ్యతలను కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఎక్కడ అలంకరణ లోటు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యూ మోతీలాల్, రోడ్లు భవనాలు శాఖ ఈ. ఈ. భాస్కర్, డి. ఈ లు, ఎస్.ఇ. నర్సింగం కాంట్రాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ ద్వారా జారీ.