జూలపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

విద్యార్ధుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

సీజనల్ వ్యాధుల నియంత్రణ పకడ్బందీ చర్యలు

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వేడి వేడిగా అందించాలి

వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జూలపల్లి మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దాపూర్ మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి ఆగస్ట్ 2:

విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం జూలపల్లి మండలం లోని పెద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వ మోడల్ పాఠశాలను, జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మోడల్ పాఠశాల పరిసరాలు కిచెన్ గది పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మంచి నీటి ట్యాంకులు నిరంతరం శుభ్రం చేయాలని , శుద్ధమైన త్రాగునీరు మాత్రమే పిల్లలు వాడే విధంగా ఏర్పాట్లు చేయాలని, పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కలెక్టర్ సూచించారు . బియ్యం కూరగాయలు, కోడిగుడ్లు, వంట సరుకులు నిల్వ ఉన్న గదిని పరిశీలించి స్టోర్ రిజిస్టర్ ను తెప్పించి నిల్వ ఉన్న స్టాక్ ను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వేడిగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఏర్పాటు చేసిన వనరులను జాగ్రత్తగా వాడుకొని కాపాడుకోవాలని, మెష్ జాళిలు, ట్యాప్ లు, అవసరం అగు వసతులను కల్పిస్తామని తెలిపారు. పాఠశాలలో రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలని, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైరల్ ఫీవర్ వచ్చే విద్యార్థులకు వెంటనే వైద్య చికిత్స అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అంతకుముందు జూలపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కరోనా వ్యాక్సినేషన్, గర్భవతుల ఏ.ఎన్ .సి రిజిస్ట్రేషన్, ఎన్ సి డి సర్వే, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వివిధ వైద్య ప్రమాణాలలో చేసిన కృషి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు

మండల ప్రత్యేకాధికారి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ఎంపీపీ.రమాదేవి, తాహాసిల్దార్ అబూబాకర్,ఎం.పి. డి. ఓ. వేణుగోపాల్ రావు, మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post