జూలూరుపాడు పట్టణానికి సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు నిర్మాణానికి 5.22 కోట్లు డి ఎం ఎఫ్ టి నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కలెక్టర్ జూలూరుపాడు మండలంలో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రహదారులు, భవనాలు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే నెలలలో పనులు ప్రారంభించడానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సిద్దంగా ఉండాలని చెప్పారు. డివైడర్లు మధ్యలో విద్యుత్తు పోల్స్ ఏర్పాటుతో పాటు అందమైన పూల మొక్కలు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు.  మన జిల్లాలోకి ప్రవేశం జూలూరుపాడు నుండి జరుగుతుందని అందంగా తయారు చేయడంతో పాటు స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.  డివైడర్లు కు అందమైన రంగులు వేయాలని ర.భ. అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా డివైడర్లు కు రేడియం స్టిక్కర్ వేయాలని చెప్పారు. డ్రైయిన్  నిర్మాణంలో స్లాబ్ వేయడంతో పాటు  అక్కడక్కడ చాంబర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గత నెలలో ప్రమాదంలో మరణించిన డి.సత్యనారాయణ కుటుంబానికి ఆపథ్బందు పధకం ద్వారా ఆర్థిక సాయం అందించుటకు ప్రతి పాదనలు పంపాలని తహసిల్దార్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ర.భ. ఈ ఈ మండల ప్రత్యేక అధికారి భీంలా, డిఈ నాగేశ్వరరావు, తహసిల్దార్ విల్సన్, సర్పంచ్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Share This Post