జెన్కో భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 3 (బుధవారం).

జెన్కో భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూసేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ జెన్కో సంస్థకు అవసరమైన భూమి మరియు ఇప్పటివరకు సేకరించిన భూమి వివరాలు మరియు పెండింగ్ భూసేకరణ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జెన్కో, రెవెన్యూ అధికారులు సమన్వయంతో జెన్కోకు అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న దుబ్బపల్లి యాష్ డంపింగ్ స్థలం, కేటీకే నుండి చెల్పూర్ మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, తాడిచర్ల నుండి జంగేడు మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, కొంపల్లి, గుడాడ్ పల్లి లో నూతనంగా భూసేకరణ, కాపురం గ్రామ పునరావాసం తదితర పెండింగ్ కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి బాధితులకు నష్ట పరిహారం, నిర్వాసితులకు త్వరగా పునరావాసం కల్పించి భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర, ఆర్డిఓ శ్రీనివాస్, జెన్కో సిఇ సిద్దయ్య, కలెక్టరేట్ సూపర్డెంట్ రవికిరణ్, భూపాలపల్లి, గన్ పూర్, మల్హర్ రావు తాసిల్దారు ఇక్బాల్, సతీష్ కుమార్, శ్రీనివాస్, జెన్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post