జోగులాంబ గద్వాలజిల్లా
నర్సరీ లో మొక్కలు పెంచేందుకు వేరు సెనగ పొట్టు, మరియు ఇతర సహజ సిద్ద మైన పదార్తాలను వినియోగించి కుండి లను తయారు చేసిన శ్రిజ మరియు నవిత అనే అమ్మాయిలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అమ్మాయుల తో మాట్లాడారు. కుండీలను ఎలా తయారు చేశారు అని అడిగి తెలుసుకున్నారు. కెట్టి దొడ్డి మండలం చింతలకుంట ప్రభ్యు త్వ హై స్కూల్ లో శ్రిజ పడవ తరగతి, నవిత తొమ్మిదవ తరగతి చదువుతున్నారని,నర్సరీ లలో మొక్కలు పెంచేందుకు వినియోగించే ప్లాస్టిక్ స్తానంలో వేరు సెనగ పొట్టుతో భూమి లో కలిసి పోయే విదంగా కుండిలను తయారు చేసిందని , బయోపాట్ ఉత్పతి కి బయో ప్రెస్ 4 టి ప్రత్యెక మిషన్లు ద్వారా బయోపాట్ పరిశ్రమ స్తపించాబోతుందని , దానికి జిల్లా నుండి సహకారం అందిస్తామన్నారు. తయారు చేసిందని దానికి వివిధ డిజైన్లలో కుండిలను తయారు చేసేలా ప్రోత్సహం ఇస్తామని, తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాది కల్పనకు ఈ మిషనరీ ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఇంటింటా ఇన్నోవేటార్ ప్రోగ్రాం కు ఎంపిక కావడం, అవార్డు తీసుకోవడం చాలా సంతోషమన్నారు. దివ్యంగుల కాలింగ్ బెల్ తయారు చేసిన నవిత ను అబినందించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఇంకా ఎన్నో చేయాలనీ మిగత విద్యార్తులకు స్పర్తి నివ్వాలని కోరారు.
తదనంతరం అబ్దుల్ కాలం రచించిన పుస్తకాలు పిల్లలకు అందజేశారు.
సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, శ్రీహర్ష , డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి ఇ ఓ సిరాజుద్దీన్, పాటశాల గణిత ఉపాద్యాయులు అగస్టీన్,తదితరులు ఉన్నారు.
——————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.