జోగులాంబ గద్వాల్ జిల్లా లో మద్యం దుకాణాల కేటాయింపు లో భాగంగా మిగిలిపోయిన మూడు మద్యం దుకాణాలను లాటరి పద్ధతి ద్వారా కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                                                            తేది 30-11-2021
జోగులాంబ గద్వాల్ జిల్లా లో మద్యం దుకాణాల కేటాయింపు లో భాగంగా మిగిలిపోయిన మూడు మద్యం దుకాణాలను లాటరి పద్ధతి ద్వారా కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అబ్కారి శాఖ ఆధ్వర్యం లో జిల్లాలో మిగిలిపోయిన 3 ధరూర్ లో (17,18,) రెండు, గట్టు లో ఒకటి (19) మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ డిప్పు తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన అబ్కారి చట్టం ప్రకారం జిల్లాకు 36 దుకాణాలను ప్రభుత్వం కేటాయించిందని, అందులో 33 దుకాణాలను తేది:20-11-2021 నాడు లాటరి పద్ధతి ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు. రీ నోటిఫికేషన్ తరువాత మిగిలిపోయన 3 మద్యం దుకాణాలకు మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ధరూర్ మండలం 17 దుకాణానికి ధరణి కుమార్ రెడ్డి , ధరూర్ మండలం 18 దుకాణానికి ఉపేంద్ర గౌడ్, గట్టు మండలం 19 దుకాణానికి సుధాకర్ రెడ్డి, లాటరి పద్ధతి ద్వారా ఎంపిక అయ్యారని తెలిపారు.
కార్యక్రమం లో ఎక్సైజ్ సుపరిటెండెంట్ సైదులు, సి ఐ గోపాల్, సిబంది, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది

Share This Post