జోగులాంబ గద్వాల్ 20 22 – 23 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ నందు ప్రవేశమునకు లక్కి డీప్ ద్వారా విద్యార్తులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.

పత్రికా ప్రకటన                                                            తేది: 7– 6 2022

జోగులాంబ గద్వాల్

20 22 – 23 విద్యా సంవత్సరమునకు  బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ నందు ప్రవేశమునకు లక్కి డీప్ ద్వారా  విద్యార్తులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.

బుధ వారం జోగులాంబ గద్వాల జిల్లా  బాల భవన్ నందు షెడ్యుల్డ్ కులముల అబివృద్ది శాఖ   అధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్కి డిప్ నిర్వహించడం జరిగిందని,  బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో  1 వ తరగతి  (నాన్ రేసిడేన్షియల్) 200 మంది మరియు  5 వ తరగతి  (రేసిడేన్షియల్)  300 మంది విద్యార్థులు దరకాస్తు చేసుకున్నారని, లక్కీ డీప్ ద్వారా 1వ తరగతి కి 23 మందిని , 5 వ తరగతికి  23 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. డిప్ ద్వారా ఎన్నికైన వారు  షెడ్యుల్డ్ కులముల అబివృద్ది శాఖ    కార్యాలయం నందు సంప్రదించి అడ్మిషన్ పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  షెడ్యుల్డ్ కులముల అబివృద్ది అధికారిని శ్రీమతి శ్వేత ప్రియదర్శిని, ఈడి ఎస్సి కార్పొరేషన్ అధికారి రమేష్ బాబు, ఆయా పాటశాలల   ప్రదనోపాద్యయులు, దరకాస్తు దారులు  తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వా ల్ గారి ద్వారా జారి చేయబడినది

 

 

 

 

 

 

Share This Post