జోగులాంబ గద్వాల జిల్లాలో కేటి దొడ్డి, ధరూర్ మండలాలు వ్యాక్సినేషన్ లో వెనుకబడి ఉనాయని, రెండు రోజులలో 100 శాతం పూర్తి చేసేలా జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లు , వి ఆర్ వో లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో కేటి దొడ్డి, ధరూర్ మండలాలు   వ్యాక్సినేషన్ లో వెనుకబడి ఉనాయని, రెండు రోజులలో 100 శాతం పూర్తి చేసేలా జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచ్, వార్డ్ నెంబర్లు, వి ఆర్ వో లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.

బుధవారం సాయంత్రం కేటి దొడ్డి మండలం ప్రజాప్రతినిధులు, సర్పంచు లు, స్పెషల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. కేటి దొడ్డి మండలం నందిన్నె, ఇరికి చెడు, కొండాపురం, కోతుల గిద్ద, చింతల కుంట,మల్లపురం తండా గ్రామాలలో వ్యాక్సిన్ శాతం తక్కువగా ఉందని జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఆయా గ్రామాలలో పర్యటించి వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలు సేకరించి వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిదంగా  ధరూర్ మండలంలో కూడా వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉందని ఇక్కడి ప్రజాప్రతినిధులు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు.   వ్యాక్సిన్ చేయించుకున్న వారి పేర్లు ఆన్లైన్లో వెంటనే నమోదు చేసి అప్లోడ్ చేయాలన్నారు. రెండు రోజులలో రెండు మండలాల్లో 100% టార్గెట్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, కేటి దొడ్డి,ధరూర్ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

 

 

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా జారీ చేయడమైనది.

 

 

 

Share This Post