జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబందించిన భూమి సర్వే పనులు ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు

పత్రికా ప్రకటన                                                                            తేది: 11-5-2022

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి  సంబందించిన భూమి సర్వే పనులు ఈ  నెల 30  నాటికి  పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్  కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులకు  ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్  సమావేశము హాలు నందు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో స్తానిక శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి తో  కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టు మండలం లో గట్టు ఎత్తిపోతల పథకంకోసం  సేకరించిన ప్రభుత్వ భూమి 127 ఎకరాలలో కట్టడాలు, చెట్లు సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్డివో ఆధ్వర్యంలో డి టీ, ఆర్ ఐ మరియు ఇర్రిగేషన్ వారితో  టీంలను  ఏర్పాటు చేసి  సర్వే నిర్వహించాలన్నారు. అప్రోచ్ రోడ్డు, కెనాల్, పంపు హౌస్ తదితర నిర్మాణాలకు స్థలం సూచిస్తూ సర్వే నిర్వహించాలన్నారు.ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పనులు పూర్తి చేయాలనీ,  అవసరమైన చోట గ్రామసభలు  ఏర్పాటు చేసి అధికారులు సమన్వయంతో సర్వే పూర్తి చేయాలన్నారు. సేడ్యుల్  తయారు చేయాలనీ ఆర్ డి ఓ కు ఆదేశించారు.    రికార్డ్స్ వెరిఫై చేసి ఇరిగేషన్, రెవిన్యూ  టీం అందరు కలిసి వెళ్లి  సర్వే పనులు  పూర్తి చేయాలనీ అన్నారు. భూమి సర్వే తో పాటు చెట్లు ఎన్ని ఉనాయని రికార్డ్స్ లో రాయాలని,పైపు లైన్లు, వ్యవసాయం, ఈత చెట్లు, అన్నింటిని ప్రాపర్ గ చూడాలన్నారు.   జిల్లా లో  ఉండే ప్రవేట్ సర్వేయర్లను, రిటైర్ అయిన సర్వేయర్లను పిలిపించి భూ సర్వే పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. చట్ట పరంగా  గ్రామ సభలు నిర్వహించాలని,   రికార్డ్స్ చెక్ చేసుకోవాలన్నారు.   సమన్వయము తో పని చేస్తే సమస్యలు రావని , ఫీల్డ్ వర్క్ ఎంత ముక్యమో పేపర్ వర్క్ కూడా అంతే ముఖ్యమని , ప్రతి రోజు రివ్యూ చేసి రిపోర్ట్ తీసుకోవాలని  అన్నారు.

ఈ సమావేశంలో ఆర్డీవో రాములు,  సుపరింటేన్దేంట్ ఇంజనీర్ శ్రీనివాస రావు ,ఇ ఇ లు వెంకటేశ్వర్ రావు, రహిముద్దిన్, గట్టు ఎం పి పి విజయ్ కుమార్, నీటిపారుదలశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారిజోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

 

Share This Post