జోగులాంబ గద్వాల జిల్లాలో ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని ముఖ్యమంత్రి ఓ ఎస్ డి శ్రీమతి . ప్రియాంక వర్గీస్ ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఎంపీడీవోలతో హరితహారం కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగించాలని జిల్లాకు ఇచ్చిన 13 లక్షల టార్గెట్ కంటే ఎక్కువగా మొక్కలు నాటి జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆమె కోరారు. గ్రామాలలో పంచాయతి సెక్రటరీ లు అనుకుంటే జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా మర్చగలరని, హరితాహారం, శానిటేషన్, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం , వైకుంట దామలను ప్రతి రోజు పర్య వేక్షిస్తుంటారని, జిల్లా లో రోడ్స్, వివిధ శాఖల ఆవరణలో మొక్కలు నాటాలని , అన్ని మండలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. రహదారుల వెంట గ్యాప్ ఉన్న చోట మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామం నుండి మండలానికి మండలం నుండి జిల్లా కేంద్రానికి గల పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారుల పొడవు వివరాలను ప్రతి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల దగ్గర సమాచారం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ధరూరు, మానవపాడు పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హరితహారం కార్యక్రమం ఏ విధంగా జరిగిందని ఆరా తీశారు. అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహించేలా వారికి ఆదేశించారు. రహదారులకు సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శుల దగ్గర ఉండాలన్నారు. మానవపాడు నుండి చెన్నిపాడు ఇతర రహదారుల పొడవున విరివిగా మొక్కలు నాటామని మానవపాడు పంచాయతీ కార్య దర్శి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అటవీ శాఖ కన్జర్వేటర్ క్షితిజ, ఐ ఎఫ్ ఎస్ , జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్ ,డిపిఓ శ్యాంసుందర్, డి ఆర్ డి ఏ ఇంచార్జి నాగేంద్రం, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.