జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

పత్రికా ప్రకటన                                                        తేది 28-8-20 21

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

శనివారం  ఆకస్మిక తనీఖీ లో భాగంగా ఇటిక్యాల మండలం తహశీల్దార్ కార్యాలయం లో  సిబంది హాజరు రిజిస్టర్ మరియు  అదికారుల పనితీరును స్థానిక తహసిల్దార్ సుబ్రహ్మణ్యం ను అడిగి తెలుసుకున్నారు. వివిధ రిజిష్టర్ లను చెక్ చేసి,   ధరణి , సాదాబైనామా  దరఖాస్తు అమలు గురించి అడుగగా. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామని తహసిల్దార్  చెప్పారు. తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులను, ధరణి నమోదు కార్యక్రమాన్ని,సిబ్బంది హాజరు రిజిస్టర్ ను , రిజిస్ట్రేషన్లు ఇతర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో భూములకు సంబంధించిన సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం ఎంపిడిఓ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి రికార్డులను పరిశీలించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్, జడ్పి హై స్కూల్   మరియు ప్రాథమిక  పాఠశాలను సందర్శించారు. ఆసుపత్రిలో రోగులు ఎంతమంది వస్తున్నారు , వారికి వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా సూచించారు.   వైద్య సిబ్బంది  ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 1 న పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించాలని, పాఠశాలల ప్రారంభోత్సవానికి అన్ని చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ప్రాదానోపాధ్యులకు ఆదేశించారు. విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన కల్పించి పిల్లలు అందరు పాటశాలకు వచ్చేలా చూడాలన్నారు.  

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి డాక్టర్ సురేష్, ఎంపిడిఓ రాం మహేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యుడు అమీర్ బాష, తదితరులు పాల్గొన్నారు.

      ————————————————————————-          జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది

Share This Post