జోగులాంబ గద్వాల జిల్లా లో క్రీడలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు

పత్రికా ప్రకటన                                                         తేది: 07-10-20 21

జోగులాంబ గద్వాల జిల్లా .

 

జోగులాంబ గద్వాల జిల్లా లో క్రీడలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

గురువారం గద్వాల పట్టణంలో చింతల్ పేట లో ఉన్న  ఇండోర్ స్టేడియంను  కలెక్టర్ తనిఖీ చేశారు.  అక్కడి మౌళిక వసతులపై యువజన మరియు క్రీడల  శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు.  స్టేడియంలోని వసతులు క్రీడా మైదానం, షటిల్,  బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్  కోర్టులను కలెక్టర్ పరిశీలించారు. క్రీడాకారులకు అవసరమైనమౌలిక  వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు ఆదేశించారు. .

ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి ఎంపీ రమేష్ బాబు, ఇండోర్ స్టేడియం ఇన్చార్జి పి ఈ టి జితేందర్ తదితరులు ఉన్నారు.

—————————————————————————

. జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చే  జారీ చేయడమైనది.

Share This Post