జోగులాంబ గద్వాల జిల్లా లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అధికారులను ఆదేశించారు

పత్రికా ప్రకటన                                                           తేది:26-10-2021

 

జోగులాంబ గద్వాల జిల్లా లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం గద్వాల ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్ తో పాటు అదనపు కలెక్టర్ శ్రీ హర్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో బీటి రోడ్ల పనులు పూర్తి చేయాలని అన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి నుండి ఇటిక్యాల, గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. మిట్టదొడ్డి నుండి బల్గేర వరకు రోడ్డు సరిగాలేదని రోడ్డు పనులు పూర్తిచేయాలని గట్టు ఎంపీపీ కోరారు. అలాగే మండలంలో ఐజ నుండి రాజాపురం వరకు బింగి దొడ్డి రోడ్లు సరిగా లేవని అయిజ ఎంపీపీ తెలిపారు. జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని టెండర్లు జరిగిన పనులు పూర్తి కాలేదని మళ్లీ టెండర్లు నిర్వహించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశాలకు విద్యుత్తు ఏ.ఈ లు పాల్గొనడం లేదని సభ్యులు ప్రశ్నించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కొరకు డీడీలు కట్టిన ఇంత వరకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని సభకు వివరించారు. ఇందుకు జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు సమావేశాలకు తప్పక హాజరుకావాలని అన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్.ఈ కు ఆదేశించారు. మండలాలలో కెసిఆర్ కిట్లు ఇటీవలి కాలంలో అందడం లేదని సభ్యులు కోరగా కరోనా సమయంలో ఇవ్వలేకపోయామని  వైద్య శాఖ అధికారి తెలిపారు. కేటి దొడ్డి మండలం లో వైద్యులను ఏర్పాటు చేయాలని కేటి దొడ్డి జడ్పిటిసి సభ్యులు కోరారు. అలాగే ఐజాలో గైనకాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండు డోసులు ఇస్తున్నట్లు కొన్ని గ్రామాలలో 100% పూర్తయ్యాయని జిల్లా వైద్యాధికారి తెలిపారు. సదరం సర్టిఫికెట్ లను వీలైనంత త్వరగా వికలాంగులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఇందుకు డి ఆర్ డి ఓ అధికారి సమాధానం చేస్తూ డాటా ఎంట్రీ ఆపరేటర్ డాక్టర్ లాగిన్ లో నుండి సదరం సర్టిఫికెట్ పరిశీలించి మంజూరు చేయాల్సి ఉంటుందని అన్నారు. అయిజ లో రైతు వేదిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని పిఆర్ అధికారికి జడ్పీ చైర్మన్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల  జెడ్పిటిసిలు ఇటిక్యాల హనుమంత్ రెడ్డి, గట్టు బాసు శ్యామల హనుమంతు నాయుడు, ధరూర్ పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, వడ్డేపల్లి  రాజు, రాజోలి శ్రీమతి  సుగుణమ్మ ముగాన్న, కేటి దొడ్డి రాజశేఖర్, మండల ఎంపీపీలు గట్టు విజయ్ కుమార్ , గద్వాల ప్రతాప్ గౌడ్, మల్దకల్ రాజారెడ్డి, మానవపాడు అశోక్ రెడి, వడ్డేపల్లి శ్రీమతి రజితమ్మ, ఐజ నాగేశ్వర్ రెడ్డి, అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే చేయడమైనది.

Share This Post