జోగులాంబ గద్వాల జిల్లా లో ఇసుక అక్రమ రవాణా జరిపితే అట్టి వారి పై పీడీ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు

పత్రికా ప్రకటన                                                        తేది: 26 -04- 2022

 

 

జోగులాంబ గద్వాల జిల్లా లో ఇసుక అక్రమ రవాణా జరిపితే అట్టి వారి పై పీడీ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలు నందు  ఇసుక రవాణా పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే మొదటిసారి పట్టుబడితే రూ. 5,000, రెండవ సారి పట్టుబడితే 15, 000 రూ,  మూడు సార్లు తనిఖీల లో పట్టుబడ్డ వాహన యజమానుల పై పిడి కేసు నమోదు చేయబడుతుంది కలెక్టర్ హెచ్చరించారు. జీవో  నెంబర్ 15 ప్రకారం పోలీసు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేసి కేసులు బుక్ చేస్తారని తెలిపారు. లారీలో అక్రమ ఇసుక తరలించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఆయా మండలాల తహశీల్దార్లు పోలీసుల సహకారంతో చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకొని రాత్రివేళ కూడా వీఆర్ఏ ల తో నైట్ డ్యూటీ లు  ఏర్పాటు చేసి  ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎక్కడెక్కడ చెకింగ్ పాయింట్ లు  ఏర్పాటు చేయాలనేది  జాబితా ఇవ్వాలని మైనింగ్ ఏడికి ఆదేశించారు. ప్రత్యేకంగా  ఇసుక  అక్రమ రవాణాను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఎస్ పి ఆఫీస్ నందు ఏర్పాటు చేయాలనీ పోలీస్  అధికారులకు  ఆదేశించారు.   తాసిల్దార్ ద్వారా ఇసుకకు అనుమతి ఇవ్వవచ్చని ప్రభుత్వ పనులకు ఇసుక కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల అదనపు గదుల నిర్మాణం చేపడుతున్న ఇసుక కొరత వల్ల జిల్లాలో 162 పాఠశాలల పనులు నిలిచి పోయాయని అన్నారు. టీ ఎస్ ఎం డి సి ద్వారా చిన్న ధన్వాడ శాండ్ రీచ్ నుండి కొత్త రీచ్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పనులకు ప్రత్యేక లాగిన్ ద్వారా ఇసుక అనుమతి ఇవ్వాలని తెలిపారు.  ప్రతిరోజు పోలీస్ మరియు  రెవెన్యు  ఇసుక వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తాసిల్దారు వారి పరిధిలో పట్టుకున్న వాహనాలకు వేసిన ఫైన్ లు, ఎన్ని వాహనాలు పట్టుకున్నారు ఏ  ఖజానాలో జమ చేస్తున్నారు తెలపాలని ఆదేశించారు. పట్టాదారు పరిధిలో ఉండే ఇసుకను tsmsidc ద్వారా అగ్రిమెంట్ చేసుకుంటే ఇసుక కమిటీ విచారణ చేసి అనుమతి ఇస్తుందని అన్నారు. మేజర్ పనులకు కావలసినంత ఇసుకను అనుమతి  ఇవ్వాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, అడిషనల్ ఎస్ పి  రాములు నాయక్ మైనింగ్ ఎడి విజయ రామరాజు, పంచాయితీ రాజ్ అధికారి సమత, ఆర్ అండ్ బి అధికారి ప్రగతి,    గ్రౌండ్ వాటర్ పరమేష్ గౌడ్, ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనుప్ రెడ్డి, ఇ ఇ ఇంట్ర శ్రీధర్ రెడ్డి,  సంబదిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————- జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబగద్వాల్ గారి చే  జారీ చేయబడినది.

 

 

 

 

 

 

 

 

Share This Post