జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యం లో రోస్టర్, మెరిట్ ప్రకారము 23 మంది ఆరోగ్య కార్యకర్తలు (ఎ.ఎన్.ఎం.)లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 22-10-2021

జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యం లో  రోస్టర్, మెరిట్ ప్రకారము 23 మంది  ఆరోగ్య కార్యకర్తలు (ఎ.ఎన్.ఎం.)లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

శుక్రవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయం లో ఒరిజినల్ ధ్రువ పత్రాలను  వెరిఫై చేసి మెరిట్ ప్రకారము 23 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను ఎంపిక చేసి అవుట్ సోర్సింగ్  పద్ధతిన వారికి అప్పాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం లో వైద్యాధికారి చందు నాయక్, ఆర్.ఎం.ఓ డా. హృశాలి, సి డి పి ఓ కమలా దేవి, రమష్, మదుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

———————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది

Share This Post