జోగులాంబ గద్వాల ప్రపంచ శాంతికి మార్గదర్శి అయిన మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య దిశగా అందరం నడవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                        తేది: 02-10-20 21

జోగులాంబ గద్వాల

ప్రపంచ శాంతికి  మార్గదర్శి  అయిన మహాత్మా  గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య దిశగా అందరం నడవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శనివారం  మోహన్ దాస్ కరం చంద్ గాంధీ (మహాత్మా గాంధీ) 152 వ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్ పి రంజన్ రతన్ కుమార్  పూలమాలలు  వేసి ఘనంగా నివాళులు అరిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అహింస మార్గంతో స్వాతంత్ర్యం తీసుకొచ్చిన  మహోన్నత వ్యక్తి గాంధీజీ ,  అయన  అడుగుజాడల్లో అందరు  నడవాలని,  గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయని, ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు.

తదనంతరం  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా కలెక్టర్ మహాత్మునికి ఘననివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, డి ఎస్ పి  రంగ స్వామి, సి ఐ భాషా, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, మున్సిపల్ కమీషనర్  హృదయ రాజు,ఎం ఆర్ ఓ లక్ష్మి,  తదితరులు పాల్గొన్నారు

 

————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.

 

 

 

 

Share This Post