జోగుళాంబ గద్వాల్ జిల్లాలో నది అగ్రహారం వెళ్లే రోడ్డు మార్గం లో డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

పత్రికా ప్రకటన                                                తేది : 22-4-20 22

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో నది అగ్రహారం వెళ్లే రోడ్డు మార్గం లో డబుల్ లైన్  బ్రిడ్జి నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

శుక్రవారం జిల్లాలో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ సమీపంలో నది అగ్రహారం వెళ్ళే రోడ్డు మార్గం లో డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ముఖ్య అతిథిగా  హాజరయ్యారు.  137.00లక్షల  వ్యయంతో చేపట్టే  డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గద్వాల పట్టణ ప్రజలు, నది అగ్రహారం ప్రజలు, ఈ ప్రాంతంలో ఉదయం వేళ వాకింగ్ కు వచ్చే వారి చిరకాల ఆకాంక్ష తీరబోతుందని, సాంకేతికంగా అన్ని సమస్యలను  అధిగమించి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిగడ్డ అభివృద్ధి కి కట్టుబడి ఉందని , విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్ల వంటి  అభివృద్ధి పనులను  ఆదర్శనియంగా  తీర్చిదిద్దుతామని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో హమాలి కాలనీ లోని పునరావాస బ్రిడ్జి నిర్మాణానికి  ప్రపోజల్ ను పంపించడం జరిగింది  అని తెలిపారు.  కాంట్రాక్టర్ త్వరగా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.  బ్రిడ్జి నిర్మాణానికి  ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఆలయం కమిటీ చైర్మన్ సతీష్ , డైరెక్టర్స్, పి.జె.పి ఎస్.ఇ. శ్రీనివాస రావు,  నీటి పారుదల శాఖ ఇ.ఇ. రహిముద్ధిన్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్స్,  తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

 

Share This Post