జోరు వానలో… సాంస్కృతిక ప్రదర్శనల *హోరు…

 

జోరు వానలో… సాంస్కృతిక ప్రదర్శనల *హోరు…

– అద్యాంతం దేశభక్తిని పెంపొందించేలా ప్రదర్శనలు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన దేశభక్తి నేపథ్య సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి.

సిరిసిల్ల పట్టణంలోని డా.సినారె కళామందిరంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ సహకారంతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వందలాది మంది వీక్షకులు సాంస్కృతిక కళా ప్రదర్శనలను తిలకించేందుకు తరలిరాగా, జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు దేశభక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తి భావన మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందని అన్నారు. దేశభక్తి నేపథ్య సాంస్కృతిక కళా ప్రదర్శనలు పిల్లలకు చిన్నప్పటి నుండే దేశభక్తిపై మక్కువ పెంచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా కళా ప్రదర్శనలు చేసిన కళాకారులను, చిన్నారులను అదనపు కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డా. రాధాకిషన్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం,మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post