టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన “మెగా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మామిళ్ల రాజేందర్

ఈరోజు నిజామాబాద్ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ , తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు ఈరోజు టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన “మెగా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మామిళ్ల రాజేందర్ గారు టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్ గారు విశిష్ట అతిథులుగా గౌరవ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు గారు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ గారు హాజరుకాగా ,కార్యక్రమాన్ని ఉద్దేశించి విశిష్ట అతిథులు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రక్తదాన శిబిరంతో పాటు నేడు ప్రజల బాగోగుల దృష్ట్యా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు, అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ శ్రీ మామిళ్ల రాజేందర్ గారు మాట్లాడుతూ ….టీఎన్జీవో నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిఖరంగా ఉందని జిల్లాఅధ్యక్ష కార్యదర్శులను కొనియాడుతూ అభినందించి మరియు ఉద్యోగుల సమస్యలతో పాటు సమాజసేవలో మేము సైతం ముందుంటామని మరోసారి నిరూపించిన నిజాంబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందానికి అభినందనలు తెలిపారు, ఉద్యోగుల సమస్యలతో పాటు సమాజసేవలో మరిన్ని మైలురాళ్లు చేదాటాలని కోరారు …ఈ మెగా రక్తదాన శిబిరంలో 150కి పైగా ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలు గా నిలిచినట్టు టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్ గారు తెలిపారు, రక్తదానం చేసిన ఉద్యోగులకు జిల్లా టీఎన్జీవోస్ పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ గారు… ఇట్టి కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాడన్నగారి విట్టల్ రావు గారు, నగర మేయర్ నీతు కిరణ్ గారు టీఎన్జీవో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ & టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ గారు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ గారు, జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్ గారు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్ గారు ,సహ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి గారు, కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బిఎల్ .శంకర్, శేఖర్, నాగరాజు, సంజీవయ్య, పోల శ్రీనివాస్ ,సత్యం , సాయినాథ్ మహిళా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి వసుమతి దేవి గారు, మంజుల గారు, విజయలక్ష్మి గారు, మరియు అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్ గారు ,జాన్ శుభాకర్, గంగా కిషన్ ,గోవర్ధన్, అన్ని శాఖల ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో హాజరయ్యారు

Share This Post