టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ధరఖాస్తులలో 14 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల నెలకొల్పనకు ఒక మాసంలోగా అనుమతులు మంజూరు చేయవలసి ఉండగా 14 దరఖాస్తులు కూడా వివిధ శాఖలలో గడువులోపలే ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టి.ఎస్.ఐ.ఐ.సి., విద్యుత్, కర్మాగారాలు,డి.టి.సి.పి . గ్రౌండ్ వాటర్, నీటిపారుదల, . రెవిన్యూ శాఖాలలో క్లియరెన్స్, ఆమోదం నిమిత్తం ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తమ స్థాయిలో పెండింగు లేకుండా నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టి-ప్రైడ్ కార్యక్రమం క్రింద కూచారం లో ఎస్టీ లబ్ధిదారుడు బొగ్గు, ఎథనాల్ కు సంబంధించి ఉత్పాధకత పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ అందజేయుటకు కమిటి ఆమోదించింది. అలాగే టి-ప్రైడ్ క్రింద 65 మంది ఎస్సి, ఎస్టీ లబ్దిదారులకు 35 శాతం సబ్సిడీతో 2 కోట్ల రూపాయల విలువ గల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 15 ఎస్సి లకు సంబంధించి 42 లక్షలు, 50 మంది ఎస్టీలకు కోటి 48 లక్షల విలువ గల వాణిజ్య వాహనాలు అందించనున్నారు.
ఈ సమావేశంలో అదనపు జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, ఎలక్ట్రిసిటీ డై రామ్ బాబు, టి.ఎస్.ఎస్..ఐ.ఐ.సి. ఈఓ తుక్యా నాయక్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్ రావు , హెమ్.ఏం.డి.ఏ. ప్లానింగ్ అధికారి నీలిమ, గ్రౌండ్ వాటర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post