టి ఎస్ బి పాస్ అనుమతులను త్వరితగతిన ఇవ్వాలి…

ప్రచురణార్థం

టి ఎస్ బి పాస్ అనుమతులను త్వరితగతిన ఇవ్వాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 1.

టి ఎస్ బి పాస్ అనుమతులు త్వరిత గతిన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో టి ఎస్ బి పాస్ అనుమతులపై మున్సిపాలిటీ రెవెన్యూ పోలీస్ ఆర్ అండ్ బి ఫైర్ బృందంగా ఏర్పడి టి ఎస్ బి పాస్ అనుమతులు లేని వాటిని తొలగించేందుకు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీ లో 261 దరఖాస్తులు టి ఎస్ బి పాస్ కింద స్వీకరించగా 132 పరిష్కరించడం జరిగిందన్నారు అలాగే డోర్నకల్లు 39 దరఖాస్తుల గాను 23 దరఖాస్తులు తొర్రూర్ లో 108 దరఖాస్తులకు 34 టిఎస్ బి పాస్ కింద అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం గానీ ప్లాట్లు చేయడం గాని జరగరాదని టి ఎస్ బి పాస్ కొరకు సైట్ ద్వారా అనుమతుల కొరకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ డి పి ఓ రఘువరన్ మహబూబాబాద్ డోర్నకల్ తొర్రూరు మున్సిపల్ కమిషనర్లు ప్రసన్న రాణి వెంకటేశ్వర్లు గుండె బాబు తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది

Share This Post