టి.ఎస్- బి.పాస్ అనుమతులు, నిర్మాణ పనులు, ఎన్ఫోర్స్మెంట్ టీములు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి

Press note. 5.10.2021.

TS b PASS ద్వారా చేపట్టే భవన నిర్మాణాలకు సంబంధించిన అన్ని విషయాలను యజమానులకు, కన్స్ట్రక్షన్ చేసే వారికి అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

మంగళవారం నాడు ఆయన తన ఛాంబర్ లో మున్సిపల్ కమిషనర్లతో టి ఎస్ బి పాస్ ద్వారా జరుగుతున్న అనుమతులు, నిర్మాణ పనులు, ఎన్ఫోర్స్మెంట్ టీముల ప్రగతిని సమీక్షించారు.

భవన యజమానులకు, కన్స్ట్రక్షన్ చేసే వారికి తప్పనిసరిగా టి ఎస్ బి పాస్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రాపర్టీ టాక్స్, నల్లా టాక్స్ వచ్చే మార్చి 31లోగా 100% పూర్తిచేయాలని ఆదేశించారు. పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా జంక్షన్ ల వద్ద వాల్ పెయింట్స్ పనులు పూర్తి చేయాలని తెలిపారు.

సమీక్షలో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

…….DPRO. YADADRI.

Share This Post