టి.ఎస్. బి- పాస్ లే అవుట్లు క్రమబద్ధీకరణపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.   తేది:10.11.2021, వనపర్తి.

లే అవుట్ల క్రమబద్దీకరణ లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను హెచ్చరించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో టి.ఎస్. బి- పాస్ లే అవుట్లు క్రమబద్ధీకరణ అంశంపై కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లాలో లే అవుట్ల క్రమబద్ధీకరణకు తొమ్మిది దరఖాస్తులు రాగా, వాటిలో 4 పర్యవేక్షణలో ఉన్నాయని, మిగతా 5 పెండింగ్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయాలని ఆమె ఆదేశించారు. వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలని ఆమె సూచించారు. టి ఎస్ బి పాస్ ద్వారా లే అవుట్లను క్రమబద్ధీకరించడానికి ప్రజలు, అధికారులకు సహకరించాలని ఆమె అన్నారు.
అనంతరం హరితహారంపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. . గుల్ మొహర్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, నర్సరీలలో మొక్కలు పెరిగేలా సకాలంలో నీరు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, (లోకల్ బాడీ) ఆశిష్ సన్గ్వాన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పివి నాగేంద్ర, ఆర్ అండ్ బి ఈ ఈ. దేశ్య నాయక్, ఇరిగేషన్ ఈ ఈ. మధుసూదన్ రావు, పంచాయతీ రాజ్ ఈ ఈ. మల్లయ్య, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ కురుమయ్య,  మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, అమరచింత, ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్లు  రమేష్, జాన్ కృపాకర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post