*టి.జీ.ఓ. డైరీ ని ఆవిష్కరించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Date-28-01-2023

*టి.జీ.ఓ. డైరీ ని ఆవిష్కరించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*

*తెలంగాణ గెజిటెడ్ అఫీసర్ల సంఘం (టి.జీ.ఓ.) హన్మకొండ జిల్లా నూతన సంవత్సర డైరీ ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, MLC పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి IDOC లోని TGO భవన్ లో శనివారం ఆవిష్కరించారు.*
ముందుగా IDOC లోని TGO భవన్ రెండవ అంతస్తులో శాసన సభ్యుల నియోజక వర్గ నిధులతో నిర్మించనున్న సమావేశ మందిర నిర్మాణ పనులను ప్రారంభించారు .

ఈ సందర్బంగా గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులను ఉద్దేశించి చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అధికారుల పాత్ర మరువలేనిదని అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్ధవంతంగా అందుతున్నాయని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఉద్యోగులతో ఎంతో అనుబంధం ఉందని వారి సంక్షేమం కొరకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని అన్నారు. భవనం నిర్మించుటకు స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

MLC పోచంపల్లి మాట్లాడుతూ నాడు తెలంగాణ సాధనలోనే గాక, రాష్ట్ర అవతరణ తర్వాత కూడా అభివృద్ధి, సంక్షేమంలో, రాష్ట్ర ప్రగతిలో ఉద్యోగులు, అధికారుల కృషి, పాత్ర ఎంతో ఉందన్నారు. ఉద్యమం లో మీ అధికారుల పోరాటం భిన్నమైనది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందంటే ప్రభుత్వ అధికారుల పాత్రే ముఖ్యమని, సీఎం కెసిఆర్, ప్రభుత్వాన్ని ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వo గా నడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగులు, అధికారులు… ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం, సేవ చేయడంలో ముందుండాలని చెప్పారు. తండ్రి కొడుకు ల బంధం. 15 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రిక్రియేషన్ కొరకు కానీ భవన నిర్మాణానికి కానీ వినియోగించుకోగలరని తెలిపారు. లైబ్రేరియన్ లకు పదోన్నతి కల్పించుటకు సీ.యం గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

అదేవిధంగా హన్మకొండ మరియు వరంగల్ జిల్లా కేంద్రాలలో TGO సంఘ భవన నిర్మాణానికి సహకరిస్తామని చీఫ్ విప్ మరియు MLC హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో TGO హన్మకొండ జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి జిల్లా కో అ ర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో, వరంగల్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు అంజద్ అలీ, కార్యదర్శులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఫణి కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, కోశాధికారులు ఈగ వెంకటేశ్వర్లు, నాగనారాయణ, DCO సంజీవరెడ్డి, అన్వర్ హుస్సేన్, డాక్టర్ మహేష్ కుమార్, మాధవ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాజేష్ కుమార్, రామ్ చందర్ రావు, రాజేష్ కుమార్ గౌడ్, ఆస్నాల శ్రీనివాస్, సుధీర్ కుమార్, హాలు నాయక్, అజార్ షరీఫ్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post