DPRO ADB -టి-ఫోలియో యాప్ ద్వారా జీవన ప్రమాణ పత్రాన్ని ఫించన్ దారులు సమర్పించాలి- ఖజానా శాఖ ఉప సంచాలకులు డా.పి.ప్రభాకర్ రావు

స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఫించన్ దారుడు టి- ఫోలియో యాప్ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు డా.పి.ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకుల వారి ఆదేశాల ప్రకారం ఫించన్ దారులు తమ జీవన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా కార్యాలయానికి సమర్పించడానికి ప్రత్యేక టి-ఫోలియో యాప్ ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ కలిగిన ఫించన్ దారులు ఈ యాప్ ను తమ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని వారి చరవాణి నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మొబైల్ నంబర్ ను యూజర్ ఐడి గా, MPIN ను పాస్ వార్డ్ గా సెట్ చేసుకొని లాగిన్ కావాలని తెలిపారు. ఫించన్ దారుడు వార్షిక వెరిఫికేషన్ ద్వారా ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ ద్వారా క్లిక్ చేసి వచ్చే ఆప్షన్ లలో బ్యాంకు ఖాతా నెంబర్ లేదా పెన్షన్ ID నంబర్ ను నమోదు చేయాలనీ, ఆ తరువాత ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఎంటర్ చేయగానే ఫొటోతో వెరిఫికేషన్ చేయబడి ఆమోదమైనట్లు ఒక ధ్రువీకరణ సందేశం వస్తుందని తెలిపారు. అట్టి సందేశం సంబంధిత ఖజానా కార్యాలయంనకు కూడా వస్తుందని తెలిపారు. ముఖ గుర్తింపు టెక్నాలజీ ద్వారా ఫించన్ దారుడి వివరాలను ఆయా ఖజానా అధికారులు వారి కార్యాలయం లో గల రికార్డులతో సరిపోల్చుకొని ఆమోదిస్తారని తెలిపారు. కనుక ప్రతి స్మార్ట్ ఫోన్ కలిగిన ఫించన్ దారుడు టి-ఫోలియో యాప్ ను వినియోగించుకొని తమ జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఆయన కోరారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన కల్పించుకొని ఖజానా శాఖ వారికీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ఫించన్ దారుల సంఘ నాయకులు ఫించన్ దారులకు ఇట్టి విషయాన్నీ తెలియపరచవలసిందిగా ఆయన కోరారు. జీవన్ ప్రమాణ్ ద్వారా కూడా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించడానికి మార్చ్, 2022 నాటికీ గడువు ఉందని ఖజానా శాఖ ఉప సంచాలకులు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Share This Post