టి. బి. నివారణకు ముందస్తు మందులు – కలెక్టర్

టి. బి. రాకుండా నివారించడానికి ముందస్తుగా మందులు పంపిణీ జరుగుతున్నదని
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్లో టి. బి. ప్రివెంట్ ధెరపీ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో మొట్టమొదటి సారి టీ. బీ. నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం టీ బి పైన అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వారికి కావలసిన పరీక్షలు మరియు వైద్య సేవలు అందిస్తూ టీ బి ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ రోజు మరొక సేఫ్టీ మందు టీ బీ వచ్చిన వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు వారితో పాటు కలిసి ఉండే వారికి టీ బి సోకే అవకాశం ఉన్నందున కాబట్టి రాకుండా ముందుగానే నివారించడానికి భయం పోగొట్టే విధంగా వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకునే విధంగా టాబ్లెట్లు కేవలం 3 నెలలు మాత్రమే వాడే విధంగా టాబ్లెట్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వివరించారు.

మెడికల్ హెల్త్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ చేరే విధంగా ఆశా వర్కర్ల ద్వారా పని చేయడం జరుగుతుందని, టీ బి పేషెంట్ ఉన్న ప్రతి ఇంట్లో ఆశ వర్కర్లు మెడిసిన్ వాడే విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జాగ్రత్తలతో పాటుగా ఈ మెడిసిన్ తీసుకుని వాడితే
టి బి పేషెంట్కు సపర్యలు చేసినా కూడా టిబి రాదన్నారు.

జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆశా వర్కర్ ద్వారా టాబ్లెట్లు తీసుకోవాలన్నారు. టీ బి పేషెంట్ చుట్టుపక్కల పరిసరాలలో ఉన్న వారు కూడా తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ ను టి బీ నివారణ జిల్లాగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రతి ఒక్కరు కలిసి ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా,
ఇన్చార్జి డీఎంహెచ్వో సుదర్శనం, డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ డాక్టర్ ఊష్మ
స్టేట్ epidomolgist డాక్టర్ సుమలత,
టి బి మరియు హెచ్ ఐ వి కోఆర్డినేటర్ రవి గౌడ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post